Home /Author anantharao b
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. సబ్‌మెరైన్ లో ఉన్న అయిదుగురు టూరిస్టుల్లో ఇద్దరు పాకిస్థానీలు ఉన్నారు. పాక్ వ్యాపారవేత్త షహజాద్ దావూద్ తో పాటు ఆయన కుమారు సులేమాన్ ఉన్నారు.
ఉక్రెయిన్‌పై సోమవారం రాత్రి భారీ ఎత్తున క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల దెబ్బకు రాత్రి మొత్తం ఉక్రెయిన్ నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి
భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనారిటీలు కారని, ఈ దేశం మనందరిదీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముస్లింల భద్రత, గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో పవన్ కళ్యాణ్ ముస్లిం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల లోన్‌కు అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మండిపడ్డారు. ముద్రగడని ఇంతకాలం పెద్ద మనిషి అనుకున్నానని, పవన్ కళ్యాణ్‌పై ఎక్కుపెట్టిన బాణాలతో ముద్రగడపై ఉన్న నమ్మకానికి తూట్లు పొడిచినట్లైందని జోగయ్య విమర్శించారు.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మంగళవారం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది, ఇది అంతర్జాతీయ నంబర్ల నుండి స్పామ్‌ల మధ్య రక్షణను పెంచడానికి వినియోగదారులను తెలియని వ్యక్తుల నుండి ఇన్కమింగ్ కాల్స్ ను స్క్రీన్ చేయడానికి అనుమతిస్తుంది.
ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్, రుణదాతలతో పెరిగిన ఉద్రిక్తత మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విభాగాలలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. మెంటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్-సేల్స్ మరియు ఫైనాన్స్ వంటి వివిధ విభాగాల ఉద్యోగులకు తొలగింపులను తెలియజేయడానికి కంపెనీ హెచ్ఆర్ బృందం జూన్ 16న తన కార్యాలయాల్లో ఫోన్ కాల్లు మరియు వ్యక్తిగత సమావేశాల ద్వారా వ్యక్తిగత చర్చలు నిర్వహించింది.
టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర మంగళవారం ఒడిశాలోని పూరీలో పవిత్రమైన ‘పహండి’ ఆచారాలతో ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవానికి దాదాపు 25 లక్షల మంది ప్రజలు వస్తారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ ) అంచనా వేసింది.