Home /Author anantharao b
థాయ్‌లాండ్‌లో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కనీసం 14 మంది మృతి చెందగా, 32 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్‌లో అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.
ఏపీలో మిచౌంగ్ తుఫాను మరో రెండు గంటల్లో బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి సుమారు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ కారణంగా బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది.
మిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.కోతకి వచ్చిన ఖరీఫ్ పంటని కాపాడుకోవడంమిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో రెండు గ్రూపుల ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించనపుడు తెంగ్నౌపాల్ జిల్లాలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది.చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
పశ్చిమ సుమత్రాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయింది. ఇండోనేషియా రెస్క్యూ సిబ్బంది 11 మంది పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. ఈప్రమాదం నుంచి ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడగా, 12 మంది కనిపించలేదు.
హైదరాబాద్ హెటల్ ఎల్లాలో సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. రేవంత్ రెడ్డి దీనిపై తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని బలపరిచారు