Home /Author anantharao b
ఉత్తర టాంజానియాలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 47 మంది మరణించగా 85 మంది గాయపడ్డారు.రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల (186 మైళ్లు) దూరంలో ఉన్న కటేష్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసిందని జిల్లా కమీషనర్ జానెత్ మయంజా తెలిపారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం నేపధ్యంలో ఏపీలోని దక్షిణ కోస్తాకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు.చెన్నైకి 130కిలో మీటర్లు, నెల్లూరుకు 220 కిలో మీటర్లు. బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో మిచౌంగ్ కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుఫాను కదులుతోంది
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? కమలనాథ్ ఒంటెద్దు పోకడే ముంచిందా ? దిగ్విజయ్ సింగ్ పైనే కాంగ్రెస్ ఆధారపడడం పొరపాటయ్యిందా ?బిజెపి సాంప్రదాయ ఓటు బ్యాంక్ చెక్కు చెదరక పోవడమేనా ? శివరాజ్ సింగ్ చౌహన్ పట్టిష్టమైన పాలనా నైపుణ్యామా ? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్ .
ప్రగతి భవన్ పేరును ఇకపై బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన తీర్పు ఇచ్చారంరటూ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం గేట్లు ఇకపై సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంటాయని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.
తెలంగాణ సాధించిన నేతగా చరిత్రలో తన కంటూ స్దానం సాధించిన కేసీఆర్ రెండు సార్లు ప్రత్యేక తెలంగాణకు సీఎంగా వ్యవహరించారు. తెలంగాణ సెంటిమెంట్ తో 2014లో, సంక్షేమ పధకాల అమలుతో 2018లో అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కు 2023 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనివెనుక కారణాలేమిటన్న దానిపై ప్రైమ్ 9 ఎనాలిసిస్..
రాజస్థాన్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, యువతులకు ఉచిత విద్య, 3,500 నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం తదితర హామీలిచ్చిన ఆ పార్టీ వాటి అమలులో చేతులెత్తేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఉత్తరాదిన జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుకు అవసరమైన మోజారిటీ మార్కును సాధించే దిశగా బీజేపీ వెడుతోంది. వీటిలో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండగా ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.