Published On:

Chandrababu: ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వందేళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్ నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో సీఎం మాట్లాడారు.

 

దేశ పురోగతిలో ఐటీ కీలక పోషిస్తోందని పేర్కొన్నారు. టెక్నాలజీని ముందుకెసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్‌ మానవాళికి వివిధ రకాల సేవలు అందుబాటులోకి తెస్తాయని వెల్లడించారు. సాంకేతకత జీవితంలో ఒక భాగంగా మారుతుందన్నారు. డ్రోన్ల సాయంతో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఏఐ, నాలెడ్జితో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

 

స్వర్ణాంధ్ర విజన్‌ 2047కు ఫిక్కీ మద్దతు..
స్వర్ణాంధ్ర విజన్-2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం వెల్లడించింది. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ సర్కారు చేపడుతున్న చర్యలు, పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో సీఎం నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఫిక్కీ అభినందనలు తెలిపింది.

ఇవి కూడా చదవండి: