Last Updated:

BSP : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే రెండో జాబితాల్లో 63 మంది సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. మొదటి జాబితాలో 20 మంది.. రెండో జాబితాలో 43 మంది అభ్యర్ధులను ప్రకటించారు.

BSP : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్..

BSP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే రెండో జాబితాల్లో 63 మంది సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. మొదటి జాబితాలో 20 మంది.. రెండో జాబితాలో 43 మంది అభ్యర్ధులను ప్రకటించారు. కాగా తాజాగా హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మూడో జాబితా అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

25 మందితో కూడిన మూడో జాబితాతో కలిపి 87 మంది అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో 32 మంది ఎస్సీలకు, 33 మంది బీసీలకు, 13 మంది ఎస్టీలకు, నలుగురు జనరల్, 5 మైనార్టీలకు సీట్లను కేటాయించింది. అలానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కొత్త మనోహర్ రెడ్డి ఇటీవల బీఎస్పీలో చేరారు. ఆయనకు మహేశ్వరం టిక్కెట్‌ను కేటాయించారు.

25 మంది అభ్యర్థుల జాబితా ఇదే..

మహేశ్వరం – కొత్త మనోహర్ రెడ్డి

చెన్నూర్ (ఎస్సీ) – డాక్టర్ దాసారపు శ్రీనివాస్

అదిలాబాద్ – ఉయక ఇందిర

ఆర్మూర్ – గండిగోట రాజన్న

నిజామాబాద్ రూరల్ – మటమాల శంకర్

బాల్కొండ – పల్లికొండ నర్సయ్య

కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్

హుస్నాబాద్ – పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్

నర్సాపూర్ – కుతాడి నర్సింహులు

సంగారెడ్డి – పల్పనూరి శేఖర్

మేడ్చల్ – మల్లెపోగు విజయరాజు

కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్

ఎల్బీ నగర్ – గవ్వసాయి రామకృష్ణ ముదిరాజు

రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (రివైజ్డ్)

అంబర్ పేట – ప్రొ.అన్వర్ ఖాన్ (రివైజ్డ్)

కార్వాన్ – ఆలేపు అంజయ్య

గోషామహల్ – మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్

నారాయణపేట – బొడిగెల శ్రీనివాస్

జడ్చర్ల – శివ పుల్కుందఖర్

అలంపూర్(ఎస్సీ) – మాకుల చెన్నకేశవరావు

పరకాల – ఆముదాలపల్లి నరేశ్ గౌడ్

భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్

ఖమ్మం – అయితగాని శ్రీనివాస గౌడ్

సత్తుపల్లి(ఎస్సీ) – నీలం వెంకటేశ్వరరావు

నారాయణఖేడ్ – మహ్మద్ అలావుద్దీన్ పటేల్.