Last Updated:

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్‌లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

Sports minister Anurag Thakur: కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్‌లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.

జూన్ 30 లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు..(Sports minister Anurag Thakur)

రెజ్లర్లతో గంటల తరబడి సమావేశం అనంతరం బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను రెజ్లర్లతో సుదీర్ఘంగా 6 గంటలపాటు చర్చించాను. జూన్ 15 నాటికి విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు సమర్పిస్తామని మేము రెజ్లర్లకు హామీ ఇచ్చాము. జూన్ 30 లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు జరుగుతాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 3 పర్యాయాలు పూర్తి చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తిరిగి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నుకోకుండా చూసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.జూన్ 15 వరకు రెజ్లర్లు నిరసనలు చేయబోరని అనురాగ్ ఠాకూర్ మీడియాతో చెప్పారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోసం ఒక మహిళ నేతృత్వంలో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలి. 3 టర్మ్‌లు పూర్తి చేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ మరియు అతని సహచరులను తిరిగి ఎన్నుకోవద్దని రెజ్లర్లు అభ్యర్థించారు. జూన్ 15 కంటే ముందు రెజ్లర్లు ఎటువంటి నిరసనలు చేయరు అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజరంగ్‌ పునియా అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరసన సందర్భంగా తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని తెలిపారు.జూన్ 15 లోపు పోలీసు విచారణ పూర్తవుతుందని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. రెజ్లర్లపై అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని మేము అభ్యర్థించాము. క్రీడామంత్రి దానికి అంగీకరించారు జూన్ 15 లోగా ఎటువంటి చర్య తీసుకోకపోతే, మేము మా నిరసనను కొనసాగిస్తామని చెప్పాడు.