Last Updated:

Mahindra Thar SUV: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తున్న థార్.. ధర ఎంతుందో తెలుసా?

Mahindra Thar SUV: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.

Mahindra Thar SUV: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తున్న థార్.. ధర ఎంతుందో తెలుసా?

Mahindra Thar SUV:  కార్ల ప్రియులకు మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లేటెస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది నెలల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

5-Door Mahindra Thar To Unveil On 26th January 2023 – Report

ధర ఎంతంటే?

కార్ల ప్రియులకు మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లెటేస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. మహీంద్రా Q4, FY23 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. 5-డోర్ల థార్ 2023లో కాకుండా 2024లో లాంచ్ అవుతుందని వెల్లడించారు.

Mahindra Thar 5 door variant launch soon in India to compete with Maruti  Jimny and Force Gurkha know features specifications - Off Road SUV सेगमेंट  में बादशाहत कायम रखने के लिए लॉन्च

ఇప్పుడు 2024 మహీంద్రా థార్ 5-డోర్ SUV మోడల్‌కు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ ఫొటోలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా థార్ SUV కారు కనిపించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే 3-డోర్ల థార్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదు.

అంతేకాకుండా, 2024 మహీంద్రా థార్ 5-డోర్ కూడా 3-డోర్ థార్ మాదిరిగా కాకుండా, కన్వర్టిబుల్ టాప్, హార్డ్ టాప్ ఆప్షన్‌లతో హార్డ్ టాప్‌ని కలిగి ఉండొచ్చు.

Mahindra Thar 5-Door Expected Price 15.00 Lakh, Launch Date, Images &  Colours (2022)- 5 दरवाजों वाली Thar ला रही महिंद्रा, ज्यादा स्पेस के साथ  बेहतर फीचर्स, जानें कब होगी लॉन्च

స్టాండర్డ్‌గా ఈ ఏడాది ప్రారంభంలో, మహీంద్రా 3-డోర్ థార్ RWD వేరియంట్‌ను లాంచ్ చేసింది. SUV మోడల్ మొదట అక్టోబర్ 2020లో 4WD ప్రామాణికంగా ప్రవేశపెట్టారు.

2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ మిల్లులు 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లను కలిగి ఉన్నాయి.

3-డోర్ థార్ ధర రూ. 10,54,500 నుంచి రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. 2024 మహీంద్రా థార్ 5-డోర్ ప్రీమియంతో రానుంది.

ఈ SUV కారు ధర రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు.