CSK vs LSG: వరుణుడిదే గెలుపు.. లక్నో, చెన్నై మ్యాచ్ రద్దు
లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో లక్నో జెయింట్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను రద్దు చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే వర్షం పడుతుండడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.
CSK vs LSG: లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో లక్నో జెయింట్స్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను రద్దు చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే వర్షం పడుతుండడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది. కొంత సేపటికి వర్షం తగ్గినప్పటికి మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలాంటి సమయంలో సాధారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగిస్తారు కానీ ఈ మ్యాచ్ కు ఈ పద్ధతిని కూడా ఉపయోగించి విజేతను నిర్ణయించే అవకాశం లేకపోయింది. నిబంధనల ప్రకారం రెండు జట్లు కనీసం ఐదు ఓవర్లు అయినా ఆడితేనే డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించే అవకాశం ఉంది. కానీ ఈ మ్యాచ్ లో చెన్నై కనీసం ఒక్క బంతి కూడా ఆడలేదు. దానితో ఈ మ్యాచ్ ను క్యాన్సిల్ చేసి రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
LIVE NEWS & UPDATES
-
మ్యాచ్ రద్దు.. ఇరుజట్లకు చెరో పాయింట్
వర్షం తగ్గినప్పటికి ఈ మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్ ప్రకటించారు.
-
వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం
వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం. ఇంకా ఒక ఓవర్ మిగిలే ఉంది.
-
7వ వికెట్ కోల్పోయిన లక్నో
7వ వికెట్ కోల్పోయిన లక్నో జట్టు. పతిరాణా బౌలింగ్లో గౌతమ్ 1 రన్ చేసి రహానే క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 125/7.
-
బదోనీ హాఫ్ సెంచరీ
30 బంతుల్లో 50 పరుగులు చేశాడు బదోనీ. లక్నో స్కోర్ 117/6. క్రీజులో బదోనీ, గౌతమ్ ఉన్నారు.
-
పూరన్ ఔట్
పతిరాణా బౌలింగ్లో నికోలస్ పూరన్ ఔట్ అయ్యాడు 31 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 103/6.
-
15 ఓవర్లు: లక్నో స్కోర్ 73/5
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్ 73/5. ప్రస్తుతం క్రీజులో బదోనీ, పూరన్ ఉన్నారు.
-
10 ఓవర్లు: లక్నో స్కోర్ 44/5
10 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్ 44/5. ప్రస్తుతం క్రీజులో బదోనీ, పూరన్ ఉన్నారు.
-
5వ వికెట్ కోల్పోయిన లక్నో
మొయిన్ బౌలింగ్లో కరణ్ ఔట్. అయ్యాడు 16 బంతుల్లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 44/5.
-
మరో వికెట్ కోల్పోయిన లక్నో
వరుసగా నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో జట్టు. స్టాయినీస్ 4 బంతులకు 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పూరన్, కరణ్ ఉన్నారు.
-
6 ఓవర్: లక్నో స్కోరు 31/3
6ఓవర్లకు లక్నో స్కోరు 31/3. కరణ్ శర్మ(3), మార్కస్ స్టోయినిస్(4) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్ల వోహ్రా, కృనాల్ ఔట్
చెన్నై బౌలర్ మహేశ్ తీక్షణ లక్నోకు భారీ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు తీక్షణ. నాలుగో బంతికి మనన్ వోహ్రా(10) క్లీన్ బౌల్డ్ కాగా, ఐదో బంతికి కృనాల్ పాండ్యా (0) ఔట్ అయ్యాడు. దీంతో లక్నో 27 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.