Last Updated:

LSG vs RCB: బెంగళూరును ఛాలెంజ్ గా తీసుకున్న సూపర్ జెయింట్స్.. లక్నో టార్గెట్ 127

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126  పరుగులు మాత్రమే చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్ గా ఉంది.

LSG vs RCB: బెంగళూరును ఛాలెంజ్ గా తీసుకున్న సూపర్ జెయింట్స్.. లక్నో టార్గెట్ 127

LSG vs RCB: మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126  పరుగులు మాత్రమే చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్ గా ఉంది. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు 43వ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేపీ ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. కాగా హోంటౌన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో లక్నో టీం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు జట్టు 6వ స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి పాయింట్ల పట్టికలో స్థానాలు తారుమారు అవుతాయి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 May 2023 09:42 PM (IST)

    లక్నో టార్గెట్ 127

    ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127.

  • 01 May 2023 09:39 PM (IST)

    మరో వికెట్ కోల్పయిన ఆర్సీబీ

    9వ వికెట్ కోల్పయిన ఆర్సీబీ. సిరాజ్ అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 121/9.

  • 01 May 2023 09:37 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    8వ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ. 2 బాల్స్ లో 2 పరుగులు చేసి కర్ణ్ వచ్చిన దారే వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 121/8.

  • 01 May 2023 09:32 PM (IST)

    మరో వికెట్ డౌన్

    ఆర్సీబీ మరో వికెట్ కోల్పోయింది. దినేష్ కార్తీక్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీం స్కోర్ 117/7.

  • 01 May 2023 09:27 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    లోమ్రోర్ వికెట్ డౌన్. 4 లోమ్రోర్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆర్సీబీ ప్రస్తుతం స్కోర్ 114/6.

  • 01 May 2023 09:21 PM (IST)

    కీలక వికెట్ డుప్లెసిస్ ఔట్

    డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. 40 బంతుల్లో 44 పరుగులు చేసి కెప్టెన్ డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 109/5

  • 01 May 2023 08:53 PM (IST)

    మ్యాచ్ కు వరుణుడి ఆటంకం

    లక్నో బెంగళూరు మ్యాచ్ కు వరుణుడి ఆటంకం.

  • 01 May 2023 08:44 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    ప్రభుదేశాయ్ వికెట్ ఔట్. 7 బంతుల్లో 6 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 90/4.

  • 01 May 2023 08:32 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    మ్యాక్స్ వెల్ ఔట్. 5 బంతుల్లో 4 పరుగులు చేసి మాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 80/3.

  • 01 May 2023 08:25 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    రావత్ క్యాచ్ ఔట్.  11 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 75/2.

  • 01 May 2023 08:13 PM (IST)

    కింగ్ కోహ్లీ ఔట్

    30 బంతుల్లో 31 పరుగులు చేసి కింగ్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 62/1. ప్రస్తుతం క్రీజులో రావత్, డుప్లెసిస్ ఉన్నారు.

  • 01 May 2023 07:57 PM (IST)

    పవర్ ప్లే: ఆర్సీబీ స్కోర్ 42/0

    పవర్ ప్లే ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 42/0. ప్రస్తుతం క్రీజులో కింగ్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నారు.

  • 01 May 2023 07:35 PM (IST)

    విరాట్ విజృంభిస్తాడా

    బ్యాటింగ్ మొదలు పెట్టిన బెంగళూరు టీం. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ డుప్లెసిస్ దిగారు.

  • 01 May 2023 07:25 PM (IST)

    తుది జట్లు ఇవే

    బెంగళూరు తుది జట్టు

    విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్

    లక్నో తుది జట్టు

    కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్

  • 01 May 2023 07:24 PM (IST)

    బెంగళూరు బ్యాటింగ్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.