MS Dhoni: బౌలర్లకు ధోని వార్నింగ్.. అలా చేస్తే కెప్టెన్ గా ఉండను
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.
బౌలర్లకు ధోని హెచ్చరిక.. (MS Dhoni)
మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో.. లక్నోపై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో చెన్నై రెచ్చిపోయి ఆడింది. దీంతో ఆ జట్టు.. మెుదట 217 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో 205 పరుగులు చేసింది. చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు ఎక్కువగా వైడ్స్, నో బాల్స్ వేశారు. వీటితోనే బౌలర్లు అధికంగా పరుగులు సమర్పించుకున్నారు.
బౌలర్ల తీరుపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారి తీరుతో.. అసహనానికి గురయ్యాడు. బౌలర్లు ఇలా చేస్తే.. కెప్టెన్‌గా దిగిపోతానని ధోని హెచ్చరించాడు.
భారీగా పరుగులు..
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లు.. మొత్తం 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఇందులో రెండు లెగ్‌బైస్, 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉన్నాయి.
బౌలర్ల తీరుపై మ్యాచ్ అనంతరం ధోని స్పందించాడు.
మేం ఫాస్ట్ బౌలింగ్‌ను మేం మెరుగుపర్చుకోవాలని తెలిపాడు. బౌలర్లు నోబాల్స్ వేయకుండా బౌలింగ్ చేయాలి.
ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి.. లేదంటే ఇక కొత్త సారథి కింద ఆడాల్సి ఉంటుంది అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరిగితే.. నేను తప్పుకుంటా అని ధోని హెచ్చరించాడు.
తుషార్ దేశ్‌పాండే మూడు నోబాల్స్ వేశాడు. ఇక గుజరాత్ తో ఆడిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లు 12 పరుగులు అదనంగా సమర్పించుకున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ సేన తొలి విజయాన్ని నమోదు చేసింది.
#CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK
— IndianPremierLeague (@IPL) April 3, 2023