Last Updated:

KL Rahul: ఒంటి చేత్తో రాహుల్‌ అద్భుత క్యాచ్‌.. వైరల్ అవుతున్న వీడియో

KL Rahul: దిల్లీ వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్.. హైలెట్ గా నిలిచింది. ఒంటి చేత్తో రాహుల్ ఈ క్యాచ్ ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

KL Rahul: ఒంటి చేత్తో రాహుల్‌ అద్భుత క్యాచ్‌.. వైరల్ అవుతున్న వీడియో

KL Rahul: దిల్లీ వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్.. హైలెట్ గా నిలిచింది. ఒంటి చేత్తో రాహుల్ ఈ క్యాచ్ ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్న రాహుల్.. (KL Rahul)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో అద్భుత ఘటన చోటు చేసుంది. అందరు నివ్వేర పోయేలా కేఎల్ రాహూల్ పట్టిన క్యాచ్ నెట్టింటా వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ లు అరుదని ప్రేక్షకులు అంటున్నారు. మంచి ఫామ్ కొనసాగిస్తున్న ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా క్యాచ్ ను అందుకున్న తీరును క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ క్యాచ్ తో భారత్ జట్టు ఫీల్డింగ్ ఎలాంటిదో అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు టీమిండియా ఫీల్డింగ్ గొప్పగా ఉండదనే అభిప్రాయం ఉండేది. కానీ ఇలాంటి క్లిష్టమైన క్యాచ్‌లను అందుకోవడంలోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముందుంటున్నారు. ఎలాంటి బంతినైనా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవాలో ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కేఎల్ రాహుల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్ తో ప్రత్యర్థి బ్యాటర్ ఉస్మాన్‌ ఖవాజాను అవాక్కయ్యాడు.

కేఎల్ రాహులపై విమర్శలు..

భారత క్రికెట్ లో కేఎల్ రాహుల్ పై విమర్శలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ లో చురుగ్గా ఉండడనే విమర్శ ఉంది. దానిని పటాపంచెలు చేస్తూ.. రాహుల్ నేడు అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఉస్మాన్‌ ఖవాజా సెంచరీకి చేరువవుతున్న సమయంలో ఈ క్యాచ్ అందుకోవడం గమనర్హం. రవీంద్ర జడేజా వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడేందుకు ప్రయత్నించి.. ఖవాజా ఔటయ్యాడు. ఈ అద్భుతమైన క్యాచ్ తో ఖవాజా షాక్‌కు గురై క్రీజులో నిల్చుండిపోయాడు. రాహుల్‌ సూపర్‌ ఫీట్‌ క్యాచ్‌ ను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్ డెవిడ్ వార్నర్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆసీస్ బ్యాటింగ్ లో ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ మినాహా ఓ ఒక్కరు రాణించలేదు. దీంతో కంగారు జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. షమీ నాలుగు వికెట్లు తీసుకోగా.. అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇక తొని ఇన్నింగ్స్ లో సిరాజ్, అక్సర్ ఒక్క వికెట్ తీయలేదు. మెుదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. వికెట్ నష్టపోకుండా.. 21 పరుగులు చేసింది. దీంతో మెుదటి రోజు భారత్ పై చేయి సాధించింది.