Janasena Yuvashakthi: ఛీఛీ నా బతుకుచెడా.. మీకోసం డైమండ్ రాణి రోజా విమర్శలు కూడా పడుతున్నా- పవన్ కళ్యాణ్
జనసేన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి రోజా, అంబటి రాంబాబులకు పవన్ ఇచ్చిపడేశారు. మంత్రి రోజాని డైమండ్ రాణి అని పవన్ విమర్శించారు.
Janasena Yuvashakthi: జనసేన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి రోజా, అంబటి రాంబాబులకు పవన్ ఇచ్చిపడేశారు. మంత్రి రోజాని డైమండ్ రాణి అని పవన్ విమర్శించారు. ఆఖరికి ఛీ ఛీ నా బతుకు చెడా మీకోసస్యం డైమండ్ రాణి రోజా విమర్శలు పడుతున్నా అని వ్యాఖ్యానించారు. సంబరాల రాంబాబు పిచ్చి కూతలు ఆపేసి పనిచేయాలి అంటూ అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్.
డైమండ్ రాణి రోజా..
వైసీపీ గూండాలకు చెబుతున్నా నేను బతికున్నంత వరకు పోరాడుతాను అన్నారు.. సంస్కార వంతంగా ఉంటే.. నా అంత సంస్కార వంతుడు ఎవరూ ఉండరు..? కానీ, రెచ్చగొడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం అన్నారు. ప్రతి సన్నాసి చేత, ప్రతి వెధవ చేత మాటలు అనిపించుకుంటుంటే నాకేమీ బాధగా లేదు. ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులతో మాట అనిపించుకోకుండా బతికేయగలను… నా చేతుల్లో ఆ జీవితం ఉంది. రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడి ఫొటోలు కూడా తీయించుకుంటారు. నాకు తిట్టించుకోవడం ఓకే… ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు తిట్టించుకోవడం నాకేమీ బాధ కలిగించదు. మన కోసం మనం జీవించే జీవితం కంటే కూడా సాటి మనిషి కోసం జీవించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు.
ఈ రాజకీయ నాయకులేమైనా దిగొచ్చారా? వాళ్లు కూడా మనలాంటి రక్తమాంసాలు ఉన్నవారే. వాడొక మాట అన్నప్పుడు మనమొక మాట అంటే వాడూ బాధపడతాడు. వాడొక దెబ్బకొట్టినప్పుడు లాగిపెట్టి మనం కూడా దెబ్బకొడితే వాడికీ దెబ్బతగులుతుంది” అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డని, ఇది కళింగాంధ్ర కాదు కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర… ఇక్కడి ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? మీ ఉపాధి కోసం మీరు నిలదీయకపోతే ఎలా? ఇక్కడి నుంచి ఎందుకు వలస వెళ్లాలి? అని ఆలోచించకపోతే ఎలా? అని కర్తవ్యబోధ చేశారు. అవసరం అయితే ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం అన్నారు.. మీ కోసం ప్రాణత్యాగం చేస్తా నని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇవి కూడా చదవండి:
Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్
Janasena Yuvashakthi: మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/