Last Updated:

రమీజ్ రాజా : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ గా రమీజ్ రాజా తొలగింపు..!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్‌గా నజం సేథీని నియమితులయ్యారు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్‌ 3-0

రమీజ్ రాజా : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)  చీఫ్ గా రమీజ్ రాజా తొలగింపు..!

Rameez Raja : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్‌గా నజం సేథీని నియమితులయ్యారు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్‌ 3-0 తేడాతో ఓడిపోవడంతో పీసీబీ చీఫ్ పదవినుంచి రమీజ్ రాజాను తొలగించారు. పీసీబీ కొత్త ఛైర్మన్‌గా సేథీ నియామకానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం ఆమోదం తెలిపారు.17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటించిన ఇంగ్లండ్ ఆటలోని అన్ని విభాగాల్లో పాకిస్థాన్‌ పై ఆధిక్యం కనబరిచి సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది. పాక్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో దారుణంగా విఫలమయింది.

2021 ఆగస్టు 27న అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చేత రమీజ్ రాజా నామినేట్ చేయబడ్డారు. అతను ఇజాజ్ బట్, జావేద్ బుర్కీ మరియు అబ్దుల్ హఫీజ్ కర్దార్ తర్వాత పీసీబీ ఛైర్మన్ అయిన నాల్గవ టెస్ట్ క్రికెటర్ కావడం విశేషం. 2003 నుండి 2004 వరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన రాజా తరువాత పీసీబీ చీఫ్ గా నియమించబడ్డారు.

ఇవి కూడా చదవండి: