Singer Mangli: ఎస్వీబీసీ సలహాదారుగా సింగర్ మంగ్లీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్ ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Singer Mangli: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్ ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బసినేపల్లె తాండకు చెందిన మంగ్లీ తెలంగాణ జానపద గీతాలతో పేరుపొంది తర్వాత సినిమాల్లోనూ సింగర్‌గా బిజీ అయ్యారు.
గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పాడిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఏడాది మార్చిలోనే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా.. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగుతారు.ఆమెకు ప్రభుత్వం నెలకు లక్ష రూపాయిలు జీతంగా చెల్లించనుంది. ఆమె తిరుపతి వచ్చినపుడు వసతి, రవాణా సదుపాయాలు ఉంటాయి.
నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ప్రముఖ కమెడియన్ ఆలీకి ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారు పదవి ఇచ్చారు.తాజాగా, మంగ్లీని ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమించారు.