Last Updated:

Thursday Sai Baba Pooja: గురువారం సాయిబాబాను ఇలా పూజించండి..

గురువారం సాయిబాబాను స్మరించుకుంటే పాపాలు తొలిగిపోతాయి అన్నది భక్తులు నమ్మకం.. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ కొలిస్తే దానికి తగిన ఫలాన్ని భక్తులు పొందుతారు. సాయిబాబా అనుగ్రహం పొందాలనుకున్న భక్తులు ఈ విధంగా చేయాలి.

Thursday Sai Baba Pooja: గురువారం సాయిబాబాను ఇలా పూజించండి..

Thursday Sai Baba Pooja: గురువారం సాయిబాబాను స్మరించుకుంటే పాపాలు తొలిగిపోతాయి అన్నది భక్తులు నమ్మకం. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే బాబాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ కొలిస్తే దానికి తగిన ఫలాన్ని భక్తులు పొందుతారు. సాయిబాబా అనుగ్రహం పొందాలనుకున్న భక్తులు ఈ విధంగా చేయాలి.

గురువారం రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. అనంతరం బాబాను ధ్యానించాలి. తర్వాత ఉపవాసం చేస్తూ, బాబాను పూజించాలి. సాయిబాబాకు పసుపు రంగు ఎంతో ఇష్టం. కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి. బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టాలి. సాయినాథుని నుదిటి పై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. చక్కెర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. దానికి తోడు మీకు ఉన్నదాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి.

ముఖ్యంగా గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదే విధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. బాబాకు జీవ హింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా బాబాకు ఇష్టమైన రోజున పై నియమాలను పాటించడం ద్వారా సాయి బాబా కృప మీపై ఎప్పుడూ ఉంటుంది.

సాయిబాబా అనుగ్రహం పొందడానికి భక్తులు తొమ్మిది రోజులుపాటు ఉపవాసం చేస్తారు. 9వరోజున పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని వేడుకోండి. అలాగే గురువారం రోజు కనీసం ఐదుగురు పేదలకు అన్నదానం చేయండి. ఈ వ్రతాన్ని చిన్న పిలల్ల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు.గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు, పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా, ఆ చిన్న పిల్లలతో కొంత సేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరువవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టం.

ఇవి కూడా చదవండి: