Last Updated:

Bigg Boss 6: గీతూకు ఓవర్ యాక్షన్ కొంచం ఓవర్ అవుతుంది అంటున్న నెటిజన్స్

బిగ్ బాస్  హౌస్లో  ప్రస్తుతం  బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది.బిగ్ బాస్ ఒక్కో  కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు.ఇంటి సభ్యులందరికి ఒక్కొక్కరికి మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ ఉంటుంది.

Bigg Boss 6: గీతూకు ఓవర్ యాక్షన్ కొంచం ఓవర్ అవుతుంది అంటున్న నెటిజన్స్

Big Boss 6: బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది. బిగ్ బాస్ ఒక్కో  కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు.ఇంటి సభ్యులందరికి ఒక్కొక్కరికి మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ ఉంటుంది. ఈ బ్యాటరీకి ఆడియో కాల్,ఆడియో మెసెజ్, వీడియో కాల్, వీడియో మెసెజ్, ఫుడ్, ఫోటోలు ఇలా ఒక్కో ఎమోషన్‌ మీద ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఐతే బ్యాటరీలో చార్జింగ్ అయిపోయినప్పుడు ఒక్కో టాస్క్ ఇచ్చి, మళ్లీ దాన్ని ఫుల్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయాలి.ఇంటి సభ్యులు రూల్స్ సరిగా పాటించకపోయినా బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంది.

ఇంటి సభ్యుల్లో రేవంత్ రెండుసార్లు నిద్రపోవడం వల్ల చార్జింగ్ పది శాతం తగ్గింది. ఇక నిన్న రీచార్జ్ చేసే పనిలో భాగంగా గీతూని లోపలకు పిలిచి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లోని వాళ్లంతా చక్కెర త్యాగం చేయాలని లేదా బాలాదిత్యతో సిగరెట్లు ఎలా అయిన మాన్పించాలనే గీతూకి టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులందరు చక్కర త్యాగం చేస్తే బ్యాటరీ 70 శాతం, బాలాదిత్య సిగరెట్లు పూర్తిగా మానేస్తే 90 శాతం చార్జింగ్ అవుతుందని బిగ్ బాస్ తెలిపాడు. వాటిలో బాలాదిత్యతో సిగరెట్లు మాన్పిస్తాను అనే టాస్క్ ఎంచుకుంది.

ఇవి కూడా చదవండి: