Last Updated:

Chhaava Movie Collections: ఐదు వారాలైన తగ్గని జోరు – బాక్సాఫీసు వద్ద ఛావా దూకుడు, పుష్ప 2 రికార్డు బ్రేక్‌!

Chhaava Movie Collections: ఐదు వారాలైన తగ్గని జోరు – బాక్సాఫీసు వద్ద ఛావా దూకుడు, పుష్ప 2 రికార్డు బ్రేక్‌!

Vicky Kaushal Chhaava Breaks Pushpa 2 Record: బాక్సాఫీసు వద్ద ఛావా దుమ్మురేపుతోంది. విడుదలై ఐదు వారాలు అవుతున్న ఇప్పటికీ తగ్గేదే లే అంటూ కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఏకంగా పుష్ప 2 రికార్డును బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా లక్షణ్‌ ఉటేకర్‌ ఈ సినిమా తెరకెక్కించారు.

ఫిబ్రవరి 14న రిలీజ్

హిస్టారికల్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైంది. కేవలం హిందీ మాత్రమే ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఛావా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా హిట్‌ టాక్‌ రావడంతో ఆ తర్వాత మార్చి 7న గీతా ఆర్ట్స్‌ ఛావాను తెలుగులో విడుదల చేసింది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది.

స్త్రీ, పుష్ప 2 రికార్డు బ్రేక్

అయితే హిందీ బాక్సాఫీసు వద్ద ఛావా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. తగ్గేదే లే అంటూ కలెక్షన్స్‌ రాబడుతోంది. ఐదో వారంలోనూ ఈ సినిమా భారీ వసూళ్లు చేసింది. దీంతో ఇప్పుడు స్త్రీ 2, పుష్ప 2 రికార్డును బ్రేక్‌ చేసి టాప్‌లో నిలిచింది. ఐదో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పుడు ఛావాలో టాప్‌లో నిలిచింది. ఐదో వీకెండ్‌లో ఛావా రూ. 22 కోట్లు సాధించగా.. ఆ తర్వాత గతేడాది విడుదలైన శ్రద్ధాకపూర్‌ స్త్రీ 2 (రూ. 16 కోట్లు) అల్లు అర్జున్‌ పుష్ప 2 (రూ. 14 కోట్లు) రెండు, మూడో స్థానంలో నిలిచినట్టు ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

కాగా ఐదో వారంతంలో అత్యధిక కలెక్షన్స్‌ చేసిన చిత్రంగా ఛావా నిలవడం విశేషం. కాగా ఛావా మూవీ ఇప్పటి వరకు హిందీంలో రూ. 750పైగా కోట్లు గ్రాస్‌ చేసినట్టు మేకర్స్‌ వెల్లడించారు. ఇక ఇదే జోరు కొనసాగితే మాత్రం త్వరలోనే పుష్ప 2 రికార్డు ఛావా బ్రేక్‌ చేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అశుతోష్‌ రానా, దివ్య దత్తా ముఖ్యపాత్రలు నటించారు. మాడాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో దినేష్‌ ఉటేకర్‌ ఛావాను నిర్మించారు.