Last Updated:

AP SSC Hall Tickets: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

AP SSC Hall Tickets: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకొని అప్లికేషన్ నంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.

కాగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. మన మిత్ర, ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అలాగే పాఠశాల లాగిన్ ద్వారా అధికారిక bse.ap.gov.inలో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

అంతేకాకుండా విద్యాశాఖ వెబ్ సైట్‌లో హాల్ టికెట్లు పొందాలంటే.. జిల్లా, స్కూల్, విద్యార్థిపేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఇక, రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లో పాఠశాలల వారీగా కూడ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.

తొలుత విద్యార్థి విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ క్లిక్ చేసిన అనంతరం హోం పేజీ వస్తుంది. ఇందులో ఎస్ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 హాల్ టికెట్లు లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీ వచ్చిన వెంటనే హాల్ టికెట్ తరహా రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, ఓఎస్ఎస్సీ లింక్‌పై క్లిక్ చేయాలి. చివరగా.. జిల్లాతోపాటు స్కూల్, స్టూడెంట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.