Last Updated:

Thadel Collectoons: బాక్సాఫీసు వద్ద ‘తండేల్‌’ మాస్‌ జాతర – వందకోట్లు కొట్టేసిన తండేల్‌ రాజు

Thadel Collectoons: బాక్సాఫీసు వద్ద ‘తండేల్‌’ మాస్‌ జాతర – వందకోట్లు కొట్టేసిన తండేల్‌ రాజు

Thandel Movie Collects Rs 100 Crore: అక్కినేని హీరో నాగ చైతన్య లేటెస్ట్‌ మూవీ తండేల్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్‌డే రూ. 21 పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌తో నాగ చైతన్య కెరీర్‌ హయ్యేస్ట్‌ ఒపెనింగ్‌ ఇచ్చిన చిత్రంగా తండేల్‌ నిలిచింది. ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కెరీర్‌లో మరో రికార్డు క్రియేట్‌ చేసింది. తాజాగా ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరింది.

మూవీ విడుదలైన వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ వెల్లడించింది. ‘బాక్సాఫీసు దుళ్లకొట్టేసారు.. థియేటర్స్‌కి జాతర తెచ్చేసారు’ అంటూ తండేల్‌ కలెక్షన్స్‌పై ప్రకటన ఇచ్చింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్‌తో తండేల్‌ బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ సునామి స్రష్టిస్తోందంటూ మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. నాగ చైతన్య కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘తండేల్‌’ మైలురాయిగా నిలిచింది.

నిజ జీవితం సంఘటన ఆధారంగా కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి తండేల్‌ను తెరకెక్కించారు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తారు. అక్కడ కోస్ట్ గార్డు అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేస్తారు. పాకిస్తాన్‌ జైల్లో రెండేళ్లుగా ఉన్న వారిని ఇండియాకు రప్పించేందుకు కుటుంబ సభ్యులు ఏం చేశారనేది తండేల్‌ కథ. దీనికి ప్రేమకథను జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు చందూ. ఎమోషనల్‌ లవ్‌స్టోరీ, దేశభక్తితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తండేల్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.

ఇందులో నాగ చైతన్య నటనకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. నిజానికి తండేల్‌ సినిమాకు ఈ రేంజ్‌లో హైప్‌, హిట్‌ పడటానికి దేవి అందించిన సంగీతం కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. దూరమైన ఇద్దరు ప్రేమికుల వ్యధ, సంఘర్షణకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. సాయి పల్లవి, నాగ చైతన్యల నటనకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం తోడవడం వల్లే తండేల్‌ ఈ రేంజ్‌లో హిట్‌ అయ్యిందనడంలో సందేహం లేదంటున్నారు ప్రేక్షకులు.