Poco C75 5G: బడ్జెట్ పద్మనాభం.. రూ. 8,499కే పోకో నయా 5జీ ఫోన్.. కొంటే మీకే మంచిది..!
Poco C75 5G: Poco ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ – Poco C75 ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ 5G వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఫోన్ లాంచ్ తేదీ గురించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని కంపెనీ వెల్లడి కాలేదు. ఇంతలో ఓ వెబ్సైట్లో రాబోయే Poco C75 5G ఫోన్‌ని గుర్తించింది. దీని ప్రకారం.. ఫోన్ భారతీయ వేరియంట్ మోడల్ నంబర్ 24116PCC1I. ఈ మొబైల్ Android 14 ఆధారంగా HyperOS 1తో వస్తుంది. ఈ ఫోన్ Redmi A4 5G రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని తెలుస్తుంది. ఈ ఫోన్ భారతదేశంలో చౌకైన 5G ఫోన్లలో ఒకటి, నవంబర్ 20, 2024న భారతదేశంలో విడుదల చేశారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో C75 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది రెడ్మి ఎ4 5జీ రీబ్రాండెడ్ వెర్షన్. ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HyperOS 1లో రన్ అవుతుంది. ఫోన్లో 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్లో Snapdragon 4s Gen 2 ప్రాసెసర్‌ను అందిస్తోంది.
Redmi A4 5G Specifications
కంపెనీ ఈ ఫోన్లో 6.88 అంగుళాల ఎల్సిడి ప్యానెల్‌ను అందిస్తోంది. ఫోన్లో అందిస్తున్న ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ HD + రిజల్యూషన్ డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో 20: 9. ఇందులో కంపెనీ గరిష్టంగా 600 నిట్ల వరకు బ్రైట్నెస్ స్థాయిని అందిస్తోంది. ఫోన్లో స్టోరేజ్ కోసం 4 GB RAM +128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో వినియోగదారులు ఫోన్ మెమరీని 1 TB వరకు పెంచుకోవచ్చు. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌ను అందిస్తోంది.
అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అదే సమయంలో కంపెనీ ఈ ఫోన్లో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్లో అందించిన బ్యాటరీ 5160mAh. ఈ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్లో 3.5mm ఆడియో జాక్, FM రేడియో, డ్యూయల్ సిమ్ వంటి ఎంపికలు ఉంటాయి. కంపెనీ ఈ ఫోన్‌ను భారతదేశంలో రూ. 8499 ప్రారంభ ధరతో విడుదల చేసింది.