Last Updated:

British Prime Minister Rishi Sunak: అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భార్య అక్షతా మూర్తి

బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. G20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సునక్, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  తనను తాను హిందువుగా గర్వపడతానని చెప్పారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో ఒక ఆలయాన్ని సందర్శించాలనే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.

British Prime Minister Rishi Sunak: అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన  బ్రిటన్  ప్రధాని రిషి సునక్,  భార్య అక్షతా మూర్తి

British Prime Minister Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. G20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సునక్, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  తనను తాను హిందువుగా గర్వపడతానని చెప్పారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో ఒక ఆలయాన్ని సందర్శించాలనే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.

గంటసేపు ఆలయంలో..(British Prime Minister Rishi Sunak)

ఈ జంట ఆలయంలో సుమారు గంటపాటు గడిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్శన గురించి అక్షరధామ్ ఆలయ డైరెక్టర్ జ్యోతీంద్ర దవే మాట్లాడుతూ, సునక్ చెప్పులు లేకుండానే ఆలయంలోకి వెళ్లారని చెప్పారు. ఆయన్ను కలిసిన తర్వాత సనాతన సంస్థతో చాలా సన్నిహితంగా మెలిగినట్లు మాకు అనిపించిందని తెలిపారు.రిషి సునక్ ఆలయంలో దర్శనం కావాలని కోరుతూ మమ్మల్ని సంప్రదించారు. అతను మమ్మల్ని ఏ సమయంలో సందర్శించవచ్చు అని అడిగారు. అతను తనకు నచ్చినప్పుు రావచ్చని మేము అతనికి చెప్పాము”అని డేవ్ చెప్పారు. అతను ఆలయంలో హారతి ఇచ్చారు, ఇక్కడ సాధువులను కలుసుకుని ఆలయంలోని అన్ని విగ్రహాలకు పువ్వులు సమర్పించారు. అతని భార్య కూడా పూజ చేసిందని వివరించారు. మేము అతనికి అతనికి ఆలయ నమూనాను బహుమతిగా ఇచ్చాము. అతను ఇక్కడ ప్రతి నిమిషం ఆనందించాడు. అతని భార్య కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను వస్తూనే ఉంటానని చెప్పారన్నారు.వారి దర్శనానికి ముందు పలువురు పోలీసు అధికారులు అక్కడ మోహరించడంతో ఆలయం చుట్టూ భద్రతా ఏర్పాట్లను పెంచారు.

అంతకుముందు శుక్రవారం, సునక్ తాను హిందువుల పండుగ రక్షా బంధన్‌ను జరుపుకున్నానని, అయితే కృష్ణ జన్మాష్టమిని జరుపుకునే అవకాశం రాలేదని, అందువల్ల ఆలయాన్ని సందర్శించడం ద్వారా “దానిని సరిదిద్దుకోవాలని” ఆశిస్తున్నానని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం G20 సదస్సులో భాగంగా సునాక్‌తో సమావేశమయ్యారు.వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడం మరియు పెట్టుబడులను పెంచే మార్గాలపై చర్చించారు