Smartphones Under 15K: చూడండి తమ్ముళ్లూ.. రూ.15 వేల లోపే ప్రీమియం ఫోన్లు.. ఆప్షన్లు బోలెడు ఉన్నాయ్..!
Smartphones Under 15K: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రతిరోజూ సరికొత్త ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే మీరు తక్కువ ధర ఉన్న ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే చాలానే ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అనేక కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో టెక్ మార్కెట్‌లో మూడు పాపులర్ ఫోన్లు ఉన్నాయి. వీటి ధర రూ.15000 కంటే తక్కువే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme C63
ఈ జాబితాలో మొదటి పేరు Realme C63 5G. ఇది ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.10,999. ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఫోన్ 6.67-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120 Hz, పీక్ బ్రైట్నెస్ 625 నిట్స్. ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌పై రన్ అవుతంది. ఇది గరిష్టంగా 8 జీబీ ర్యామ్ కలిగి ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 32మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌తలో పవర్ కోసం 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Oppo K12x
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల HD + LCD డిస్‌ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 ప్రాసెసర్ ఉంది. స్టోరేజ్ కోసం 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8జీబీ వరకు ర్యామ్ ఉంది. కెమెరా ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫోన్‌లో 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించారు.
Vivo T3x
ఈ జాబితాలో మూడవ ఫోన్ Vivo T3x 5G. ఈ ఫోన్ ధర రూ.14,499. ఫోన్ 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ అందించారు. ఇది 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. కంపెనీ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.