Last Updated:

iPhone SE 4 Vs iPhone 15: ఐఫోన్ SE 4 బెటరా? ఐఫోన్ 15 కొంటే బెటరా? మీకు ఏ ఐఫోన్ బెస్ట్ అంటే? ఫుల్ డిటెయిల్స్..!

iPhone SE 4 Vs iPhone 15: ఐఫోన్ SE 4 బెటరా? ఐఫోన్ 15 కొంటే బెటరా? మీకు ఏ ఐఫోన్ బెస్ట్ అంటే? ఫుల్ డిటెయిల్స్..!

iPhone SE 4 Vs iPhone 15: యాపిల్ చౌకైన ఐఫోన్ లాంచ్ గురించి చాలా కాలంగా టెక్ మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఇంతలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల X లో ఒక పోస్ట్ చేసారు, ఆ పోస్ట్‌లో ‘కుటుంబంలోని సరికొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉండండని రాసుకొచ్చారు. ఆపిల్ తన కొత్త ఉత్పత్తిని 19 ఫిబ్రవరి 2025న ప్రారంభించనుంది. ఈ పోస్ట్ తర్వాత ఈ రోజున కొత్త ఐఫోన్ SE 4 లాంచ్ కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ 2024లో యాపిల్ అత్యధికంగా అమ్ముడైన iPhone 15 కంటే శక్తివంతమైనది. ఐఫోన్ SE 4, ఐఫోన్ 15 మధ్య స్పెసిఫికేషన్‌లలో ఎటువంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం.

iPhone SE 4 Vs iPhone 15 Design
iPhone SE 4 దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే మెయిన్ డిజైన్ అప్‌గ్రేడ్‌ అవుతుంది. బాక్సీ ప్రొఫైల్, డిస్‌ప్లే నాచ్‌తో స్మార్ట్‌ఫోన్ iPhone 14 లాగా ఉంటుంది. అయితే, ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌కు బదులుగా సింగిల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్‌లో USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.

మరోవైపు ఐఫోన్ 15 మోడల్ అదే లుక్‌లో ఉంటుంది, కానీ దీనికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. రెండు మోడల్‌లు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. అయితే, iPhone 15లో డైనమిక్ ఐస్‌లాండ్ ఉంది. అయితే iPhone SE 4 ఫేస్ ID ఫీచర్‌తో డిస్‌ప్లే నాచ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

iPhone SE 4 Vs iPhone 15 Camera
ఐఫోన్ SE 4 48MP సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇది ఐఫోన్ 15 మోడల్‌ల వలె అదే పిక్చర్ క్వాలిటీని అందించవచ్చు. iPhone 15 వెనుక ప్యానెల్‌లో అదనపు 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండచ్చు. అయితే పిక్చర్ క్వాలిటీలో మార్పులు ఉండొచ్చు.

iPhone SE 4 Vs iPhone 15 Performance
iPhone SE 4 మొదటిసారిగా 8GB RAMతో A18 చిప్‌ని పొందవచ్చు. ఈ హార్డ్‌వేర్ ఐఫోన్ 16 మోడల్‌లలో కూడా కనిపిస్తుంది. మరోవైపు, ఐఫోన్ 15 6GB RAMతో A16 బయోనిక్ చిప్‌ ఉంది, ఇది చౌకైన iPhoneల కంటే కొంచెం స్లోగా ఉంటుంది. తక్కువ ర్యామ్ కారణంగా, ఈ ఫోన్‌లో AI ఫీచర్లు అందుబాటులో లేవు.

iPhone SE 4 Vs iPhone 15 Price
దేశంలో iPhone SE 4 128GB వేరియంట్ ధర సుమారు రూ. 50 వేల నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 128GB వేరియంట్ ధర రూ. 69990, ఇది SE మోడల్ కంటే చాలా ఎక్కువ.