Published On:

Oppo K13 5G: వావ్‌.. 7000mAh బ్యాటరీతో Oppo K13 5G.. స్మార్ట్‌ఫోన్‌ డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..!

Oppo K13 5G: వావ్‌.. 7000mAh బ్యాటరీతో Oppo K13 5G.. స్మార్ట్‌ఫోన్‌ డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..!

Oppo K13 5G: చైనీస్ టెక్ బ్రాండ్ ఒప్పో 12 లక్షలకు పైగా Oppo K12x స్మార్ట్‌ఫోన్ యూనిట్లను విక్రయించి హిస్టనీ క్రియేట్ చేసింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo K13 5Gని లాంచ్ చేయబోతోంది. కంపెనీ స్వయంగా ఈ సమాచారాన్ని అందించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి రానుంది. ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీతో పాటు అనేక అద్భుతమైన ఫీచర్లు కనిపించబోతున్నాయి. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర రూ.20,000 కంటే తక్కువగా ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Oppo K13 5G Launch Date In India
భారతదేశంలో Oppo K13 5G లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లోకి రావచ్చు. ఏప్రిల్ 24, 2025 నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు. అయితే, ఈ తేదీ కేవలం అంచనా మాత్రమే. కంపెనీ దీనిని నిర్ధారించలేదు.

 

Oppo K13 5G Price
భారతదేశంలో Oppo K13 5G ధర, అమ్మకాలకు సంబంధించి కంపెనీ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ లీక్‌లు, మార్కెట్ చర్చల ఆధారంగా.. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కంపెనీ రూ. 20 వేల కంటే తక్కువ ధరకు లాంచ్ చేస్తుంది.

 

Oppo K13 Features And Specifications
లీక్ ప్రకారం ఒప్పో K13లో 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించనున్నట్లు కూడా లీక్‌లో వెల్లడైంది. స్మార్ట్‌ఫోన్‌ను AMOLED డిస్‌ప్లేలో లాంచ్ చేయచ్చు. ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌తో లాంచ్ అవుతుంది. ఈ డిస్‌ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుందని వెల్లడించారు. లీక్ ప్రకారం.. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఇవ్వచ్చు. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉండచ్చు. ఈ 5G ఫోన్‌కు IR బ్లాస్టర్ టెక్నాలజీ, IP69 రేటింగ్ అందిస్తారని లీక్‌లో వెల్లడైంది.