Published On:

Moto G Stylus 5G 2025: మోటో నుంచి స్టైలిష్‌ స్మార్ట్‌‌ఫోన్‌.. ఫీచర్స్‌ కేక అంతే.. లాంచ్ ఎప్పుడంటే?

Moto G Stylus 5G 2025: మోటో నుంచి స్టైలిష్‌ స్మార్ట్‌‌ఫోన్‌.. ఫీచర్స్‌ కేక అంతే.. లాంచ్ ఎప్పుడంటే?

Moto G Stylus 5G Launching: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ “Moto G Stylus 5G” (2025). ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది యూజర్ల నోట్స్ తీసుకోవడం, డూడుల్స్ క్రియేట్ చేయడం, ఫోటోలను ఎడిట్ చేయడం వంటి అనేక టాస్క్‌లను చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌పోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. మోటరోలా యూఎస్ మార్కెట్ కోసం G సిరీస్‌లో మోటో జి స్టైలస్ (2025)ని పరిచయం చేసింది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Moto G Stylus 5G (2025) Price
మోటో జి స్టైలస్ (2025) జిబ్రాల్టర్ సీ,సర్ఫ్ ది వెబ్ పాంటోన్ రంగులలో లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని ధర USD 399.99 (దాదాపు రూ. 34,505). అదే సమయంలో ఇండియా లాంచ్ గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్ ఏప్రిల్ 17 న భారతదేశంలో లాంచ్ కానుందని కంపెనీ తన అధికారిక సమాచారాన్ని ఇచ్చింది. ఈ ఫోన్ దేశంలో అమెజాన్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేల్‌కి రానుంది.

 

Moto G Stylus 5G (2025) Features & Specifications
నోట్స్ రాయడం, స్కెచ్‌లు గీయడం, యాప్‌లను నావిగేట్ చేయడం కోసం బిల్ట్ ఇన్ స్టైలస్. ఇది మునుపటి సిరీస్ కంటే 6.4 రెట్లు మెరుగైన రెస్పాన్స్. దీనితో పాటు, స్కెచ్ టు ఇమేజ్, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు కూడా ఫోన్‌లో అందించారు.

 

ఈ ఫోన్ డస్డ్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్‌ మిలిటరీ-గ్రేడ్ క్వాలిటీని కూడా పొందుతుంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది, కానీ రిజల్యూషన్ ఇప్పుడు FHD+ తో పోలిస్తే 1.5K, గరిష్టంగా 3000 నిట్‌ల బ్రైట్నెస్ అందిస్తుంది.

 

ఫోన్‌ను శక్తివంతం చేయడానికి.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే.. దీనిలో 50మెగాపిక్సెల్ లిటియా 700C సెన్సార్ ప్రైమరీ కెమెరా, 13మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, ముందు భాగంలో 32మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. కొత్త మోటో జి స్టైలస్ 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.