Samsung Galaxy S25 Edge Price Leaked: అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ప్రైస్ లీక్.. ఫీచర్లు చూస్తే లాంచ్ అవ్వగానే కొనేస్తారు!

Samsung Galaxy S25 Edge Launch Price Leaked: మీరు కూడా ఎంతో ఆసక్తిగా Samsung Galaxy S25 Edge కోసం ఎదురు చూస్తున్నారా? అయితే సామ్‌సంగ్ తన కొత్త ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందే ఫోన్ గురించి చాలా సమాచారం లీక్ అవుతోంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీనితో పాటు కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ లీకైన ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy S25 Edge Launch Date
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ మే 13, 2025న లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ గెలాక్సీ25 సిరీస్ ఫోన్‌ల వంటి ఫీచర్లు ఉండచ్చు. ఇది కంపెనీలో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని చెబుతున్నారు. ఈ ఫోన్ టైటానియం జెట్ బ్లాక్, టైటానియం ఐసీ బ్లూ, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Samsung Galaxy S25 Edge Price Leak
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. యూరోపియన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ జెనెట్టి షాప్ ప్రకారం.. గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ప్రారంభ ధర EUR 1,361 అంటే దాదాపు రూ. 1,27,900 కావచ్చు. అయితే టాప్ వేరియంట్ ధర EUR 1,484 అంటే రూ. 1,39,800 కావచ్చు. గెలాక్సీ ఎడ్జ్25 రెండు స్టోరేజ్ ఆప్షన్లలో 256జీబీ, 512జీబీలలో అందుబాటులో ఉండచ్చు.
Samsung Galaxy S25 Edge Features And Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ప్రధాన స్పెసిఫికేషన్ల గురించి మనం మాట్లాడుకుంటే.. ఫోన్‌లో 6.6-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ OneUI 7 పై రన్ అవుతుంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రావచ్చు. ఈ ఫోన్‌లో 3,900mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే, 25W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 200MP, ద్వితీయ కెమెరా 12MP కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- iOS 19 Features Leaked: యాపిల్ కొత్త అప్ డేట్.. ఈసారి iOS 19లో ఏం ఉండబోతుంది.. టెక్ ప్రపంచం వెయిటింగ్!