Home / ysrtp
వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఎన్నికల నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండాలని తనను కాంగ్రెస్ నేతలు కోరారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్‌తో షర్మిల చర్చించారు.
YS Sharmila: ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ..
YS Sharmila: తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పలు విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.