Home / Wrestling Federation of India
భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ) బుధవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుఎఫ్ఐ ) కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. భూపేంద్ర సింగ్ బజ్వా ఛైర్మన్గా, సోమయ, మంజుషా కన్వర్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ డబ్ల్యుఎఫ్ఐ యొక్క వివిధ పనులు మరియు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
డబ్ల్యుఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏడాది ప్రారంభంలో అనేక వాయిదాల తర్వాత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు గురువారం డిసెంబర్ 21న జరిగాయి.
ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ( యుడబ్ల్యుడబ్ల్యు) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుఎఫ్ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేసింది. డబ్ల్యుఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీనివల్ల దాని ఎన్నికలు గణనీయంగా వాయిదా పడ్డాయి.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, చట్టం పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతోంది అని ఆరోపించారు. మేము దానిని మార్చమని ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని తెలిపారు