Home / wrestlers protest
భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటామని..
లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత విధుల్లో చేరారు. అయితే ఆందోళన మాత్రం కొనసాగిస్తామని తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసన నుంచి సాక్షి మాలిక్ విరమించుకున్నారు. ఆమె ఉత్తర రైల్వేలో తన ఉద్యోగంలో తిరిగి చేరింది. రెజ్లర్లు శనివారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కలిసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనపై అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాలను కమిటీ కలుస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ గురువారం తెలిపారు.బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నమోదైన పోక్సో కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వెలుపల మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు కూడా వీరికి మద్దతు నివ్వడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్‌లైట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది
హర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు మరియు వారి సంరక్షకులు తమను విశ్వసిస్తున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.