Home / voting
లోక్ సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
నగరాల్లో నివసించే వాళ్లలో ఎక్కువగా విద్యాధికులు వుంటారు .ఉద్యోగాలు ,వ్యాపారాలు ,చేతిపనులు చేసుకునే వారు అధికం .అయితే పోలింగ్ రోజు మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారు .ప్రతి ఎన్నికల సమయంలో ఇదే తంతు జరుగుతుంది.దీనితో నగర వాసులకన్నా గ్రామీణ ప్రాంత వాసులకే ఎక్కువగా రాజకీయ చైతన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ లా కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా బెనర్జీకి.. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.