Home / Vinesh Phogat
భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.
డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వెన్నెముక లేని సర్వెంట్ గా యోగేశ్వర్ దత్‌ని ప్రపంచం గుర్తుచేసుకుంటోందని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం అన్నారు, తనతో పాటు మరో ఐదుగురికి ఆసియా క్రీడలు మరియు ప్రపంచ పోటీల నుండి మినహాయింపు ఇవ్వడాన్ని దత్ ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన బాలికలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రెజ్లర్ వినేష్ ఫోగట్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను.నేను మాత్రమే కాదు, ఫిర్యాదు చేసిన అమ్మాయిలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసు సిబ్బందితో గొడవ తర్వాత, నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా గురువారం తమ పతకాలు మరియు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఇలా అవమానాలకు గురవుతుంటే ఈ సన్మానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు.
: తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టమని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఇతర అగ్రశ్రేణి రెజ్లర్లతో కలిసి ఆమె నిరసన తెలుపుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేసారు.