Home / Vinayaka Chavithi
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా హైదరాబాద్ నగరంలో
వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందుకు గాను హైదరాబాద్,
విడుదలైన ఐదు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ నుండి ప్రేరణ పొంది దానిని గణపతి విగ్రహాలకు వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.