Home / Vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఈ దినం ఉదయం విజయవాడ జింఖానా మైదానంలో చోటుచేసుకొన్న బాణసంచా దుకాణాల అగ్ని ప్రమాదంలో ఇరువురు చనిపోయిన సంగతి విధితమే. దీనిపై భాజపా నేత విష్ణు వర్ధన రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రమాదకర వ్యాపారాలకు నగరంలోని కీలక ప్రాంతంలో ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏపీ సీఎం జగన్, భార్య భారతీ ఇద్దరూ కలసి గవర్నర్ బిశ్వభూసన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు చేరుకొన్న సీఎం దంపతులకు సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.