Home / Vijayawada
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు
అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.
మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.