Published On:

IPL 2025 22nd Match: ఆర్య మెరుపు సెంచరీ.. చెన్నైపై పంజాబ్ ఘన విజయం

IPL 2025 22nd Match: ఆర్య మెరుపు సెంచరీ.. చెన్నైపై పంజాబ్ ఘన విజయం

Punjab Kings won by 18 runs, Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 220 పరుగులు లక్ష్యఛేదనలో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్ మూడో విజయం సాధించగా.. చెన్నై‌కు నాలుగో ఓటమి. ఇక, పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై 9వ స్థానానికి పరిమితమైంది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్(9), స్టాయినిస్(4), వధేరా(9) మ్యాక్స్ వెల్(1) వరుసగా పెవిలియన్ చేరారు. 8 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ కింగ్స్‌ను ప్రియాంశ్ ఆర్య(103, 42 బంతుల్లోనే 7ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో ఆదుకున్నాడు. చివరిలో శశాంక్(52, 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేయడంతో పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది.

 

220 పరుగుల భారీ లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ సింగ్స్ 20 ఓవర్లలో 20 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. డెవవాన్ కాన్వే(69), రచిన్ రవీంద్ర(36), శివమ్ దూబె(42), ధోనీ(27) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఠాకూర్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.