Home / Varanasi court
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞాన్‌వాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో పూజలకు అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసివున్న 'వ్యాస్ కా టెఖానా'లో ప్రార్థనలు చేయవచ్చు. అంతకుముందు రోజు విచారణ సందర్భంగా రాబోయే ఏడు రోజుల్లో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.
జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందూ పక్షం పిటిషన్‌ను కొనసాగించడాన్ని వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం సమర్థించింది.
జ్ఞాన్‌వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.