Home / United Arab Emirates
:యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ను వరదలు ఒక పట్టాన వదిలేట్టు కనిపించడం లేదు. గత నెల దుబాయిలో గత 70 ఏళ్లలో ఎన్నడూ కురవని విధంగా భారీ వర్షాలు దుబాయిని అతలాకుతలం చేశాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం మరో మారు అబుదబితో పాటు దుబాయిని భారీ వర్షాలు ముంచెత్తాయి.
వివాహ వేడుక అనేది జీవితాంతం మరచిపోలేని వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను కొంతమంది విదేశాలకు కూడ తరలి వెడుతున్నారు. ఇలా ఉండగా తన కుమార్తె ప్రత్యేక రోజును గుర్తుంచుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పాప్లీ ఇటీవల ఒక ప్రైవేట్ విమానంలో వివాహాన్ని నిర్వహించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు , మహిళా సాధికారత అనేది ఒక ప్రాధాన్యత. ఈ వ్యూహానికి ప్రైవేట్ రంగం గట్టిగా మద్దతు ఇస్తుంది. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు మరియు గుర్తింపును ఇవ్వడానికి అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ సోమవారం నుంచి అప్‌డెటేడ్ వీసా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పర్యాటకుల కోసం పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. అయితే ఇక్కడ దీర్ఘకాలం పాటు ఉండాలనుకొనే వారికి గతంలో ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చమురు ధరలు పెరగడం పై ప్రజా స్పందనను వెల్లడించినందుకు ఇక్కడి అల్ రోయా పత్రిక సంపాదకులు, విలేకరుల ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఏకంగా పత్రిక ప్రింట్ ఎడిషన్ శాశ్వతంగా మూతబడిపోయింది.