Home / UK Prime Minister
బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ప్రశ్నించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ల భేటీ ఖరారైంది. నవంబర్ లో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపిన్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వార తెలియచేసింది.
బ్రిటన్ రాజకీయ అస్థిరతకు తెరపడింది. ప్రధానమంత్రిగా రిషి సునాక్ నియమితులయ్యారు. అయితే ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమనేది ఆయనకు కత్తి మీద సాములాంటిదేనని నిపుణులు భావిస్తున్నారు.
బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన అజెండా అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు.
వలస పేరుతో భారతదేశానికి వచ్చి, మనలను బానిసలుగా చేసిన బ్రిటిష్ దేశానికి ఇప్పుడు భారత సంతతి వ్యక్తి , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రధాని కావడం గర్వకారణం. సుమారు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఆంగ్లేయులను ఇప్పుడు మనవాడు పరిపాలించనున్నాడు. అందులోనూ దీపావళి రోజే రిషి ఎన్నిక కావడం మరో విశేషం. ఈరోజు మనవాడు బ్రిటన్ ప్రధాని అవ్వడంతో ఇది కదా మనకు అసలైన దీపావళి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనకు ఇండియాతో ఉన్న అనుబంధం ఏంటి? బ్రిటన్ కొత్త ప్రధాని పూర్వీకుల మూలాలు ఇండియాలో ఉన్నాయి. రుషి సునక్ జీవిత ప్రస్థానంపై ప్రైమ్9 స్పెషల్ స్టోరీ.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో రిషి సునక్ అత్యున్నత ప్రధాన మంత్రి పదవి చేపట్టడంపై భారత్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటన్ ప్రధానిగా లిజ్‌ట్రస్ 45 రోజులే పదవిలో ఉన్నారు. కానీ ఆమెకు జీవితాంతం ఏడాదికి (1,15,000 పౌండ్లు) కోటిరూపాయల చొప్పున భత్యం అందనుంది.