Home / Toshakhana case
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తోషా ఖానా కేసులో భారీ ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తోషా ఖానా కేసులో ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5వ తేదీన ఖాన్ అరెస్టు అయ్యి అటాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన తోషాఖానా కేసును ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) మంగళవారం "అమోదయోగ్యం కాదు" అని ప్రకటించింది. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్ తీర్పు ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాస్పద తోషాఖానా కేసులో ఊరట లభించింది. ఈ అంశాన్ని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధించింది.. కోర్టు తన తీర్పును వెలువరిస్తూ, తోషఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది