Home / Tirupati
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిని పేదల పక్షపాతిగా టిటిడి బోర్డు మెంబరు కిలివేటి సంజీవయ్య అభివర్ణించారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేర్కొన్నారు.
దివంగతులైన పెద్దలను స్మరించుకొనే దినాల్లో మహాలయ అమావాస్య ఒకటి. పితృదేవతలను తలచుకుంటూ పేదలకు అన్నదానం చేస్తే వారు స్వర్గ లోప ప్రాప్తిని చేరుకొంటారనేది ఓ భావన. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్యవైశ్య సంఘం ఓ వృద్ధాశ్రమంకు ఫలసరుకుల అందచేసి పెద్దలను స్మరించుకొన్నారు.
నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని... భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు.
తిరుపతిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కింద నేపాల్ నుంచి వచ్చిన ప్రసాద్ శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకుడిగా చేరాడు. అంతకుముందు కాశీలో అర్చకత్వం చేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నుంచి శ్రీ వశీష్ట
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా