Home / Telugu Festivals
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగి శుభాకాంక్షలు చెప్పారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' పేరు.