Home / television Anchors
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పోవేపోరా ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ తన మార్క్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షుకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు విష్ణుప్రియ.
యాంకర్ శ్రీముఖి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ రాములమ్మగా మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ కనిపిస్తుంది.