Home / Telangana
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 ఉత్తీర్థన సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం, ఈ సెట్లో 90.7 శాతం మంది ఉత్తీర్ణీలయ్యారు.
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్‌పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 4 లక్షల 14 వేల 14 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4 లక్షల 22 వేల 292 క్యూసెక్కులుగా ఉంది.
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు.
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.