Home / Teachers
ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. . తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ, జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు