Home / TDP
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.