Home / TDP
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో బాగంగా ఛలో కావలి పేరిట బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు
టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని పట్టణంలోని మార్కెట్ కూడలి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్నించారు. అన్నక్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే జగన్ లో మానవత్వం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి ట్వీట్ చేసారు.
ఎన్డీఏలో చేరిక అంశం పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఏన్డీఏ నుంచి బయటకు వచ్చామని, ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తాంమని చెప్పారు.
సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.