Home / TDP
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలను నల్లుల్లా నలిపేస్తానని హెచ్చరించారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.
వ్యవస్దలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని
ఏపీకి జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోందని విమర్శించారు.
వైసపీ ఎంపీ మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.ఇది ఫేక్ వీడియో అని మీడియా కు తెలిపారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబకు ఊహించని పరిణామం ఎదురైయింది. చంద్రబాబు ముందే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలిన లెక్కచేయలేదు. చేతికి ఇచ్చిన బొకేను చంద్రబాబు ముందే తోసేశారు.
ఈ నెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్పురం మండలాల్లో 22న పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు.