Home / Tamil Nadu News
భారత వాతావరణ శాఖ ( ఐఎండి) తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటానికి అని కోర్టు పేర్కొంది.
తమిళనాడులో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 4,000-4,500 ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు.
తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు పెళ్లి కుదరడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబత్తూరులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది.
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ సమీపంలో గురువారం పసికందు మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత, పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న బాలిక ద్వారా శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు.