Home / Taiwan
చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని USGS తెలిపింది.
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యటలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్‌బర్న్ ఈ నెల 25 నుంచి27 వరకు తైపీ పర్యటన చేపట్టారు.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం నిరసన వ్యక్తం చేసింది.