Home / Sweets recipes
మనలో చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే ఏవో ఒకటి తింటూ ఉంటాము. ఆ సమయంలో మనం అన్నం వండుకొని తినే సమయానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా మనకి సెలవు రోజు వచ్చినప్పుడు ఏదో ఒక పిండి వంట చేసుకుంటే ఆఫీసు నుంచి రాగానే తినవచ్చు.
శ్రావణమాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు, పండుగలు మొదలవుతాయి. ఈ సందర్బంగా పలు రకాల పిండివంటలను, నైవేద్యాలను తయారు చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే స్వీట్స్ విషయానికొస్తే ఎప్పుడు తినేవి కాకుండా కొత్త రకాలను ట్రై చేయాలని పలువురు భావిస్తారు.
మనం వంటింట్లో పచ్చి కొబ్బరిని ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పచ్చడిని, కొబ్బరి చట్నీని, కొబ్బరి అన్నాన్ని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసుకోగలిగే తీపి పదార్థాలలో కొబ్బరి ఉండలు కూడా ఒకటి. ఈ కొబ్బరి ఉండలు ఎంతో రుచిగా ఉంటాయి.